పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0023-1 శ్రీరాగం సం: 05-126

పల్లవి:

కలకి కాఁతాళమలు కారింపులా
లలితంపు వలపులకు లంచములు గాక

చ. 1:

కిసరు కనుఁగొనల జంకెనలు విరసంబులా
రసములొలికెడి మనోరతులు గాక
కొసరు గుంపెనల సిగ్గుల విళంబంబులా
దుసికిలని మోహముల దొంతరలు గాక

చ. 2:

అబ్బురములైన పొలయలుక లోలంబులా
గబ్బుఁ దమకముల మీఁగడలు గాక
గబ్బిమాటలు సాళంగంబులవి యేతులా
గుబ్బతిలు మోహముల కుంటెనలు గాక

చ. 3:

కొనబు కొనగోళ్ళ తాఁకులవి మే నొప్పులా
ననుపులకు నుబ్బుఁగవణములు గాక
వనితకీవేంకటేశ్వరు సిరులు మరపులా
మనసు మర్మముల తన్మయములవి గాక