పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0022-5 ఆహిరి సం: 05-125

పల్లవి:

మూసిన ముత్యాన కేలే మొరఁగులు
ఆసల చిత్తానకేలే అలవోకలు

చ. 1:

కందులేని మోము కేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే సేమంతులు
మందయానమునకేలే మట్టెలమోఁత
గందమేలే పైపై కమ్మని నీ మేనికి

చ. 2:

బారపు గుబ్బలకేలే పయ్యెద నీ-
బీరపుఁ జూపుల కేలే పెడమోము
జీరల బుజాలకేలే చెమటలు నీ-
గోరంట గోళ్ళకేలే కొనవాండ్లు

చ. 3:

ముద్దుల మాఁటలకేలే ముదములు నీ-
యద్దపుఁ జెక్కులకేలే అరవిరి
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు-
నద్దమేలే తిరువేంకటాద్రిశుఁ గూడి