పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0022-5 ఆహిరి సం: 05-124

పల్లవి:

కెరలి బయట దాఁగీ వీఁడు తన-
వొరపులు చూపుచు నొరగీ వీఁడు

చ. 1:

కొమ్మ చూడవే కొలిమిగూటిలో-
నమ్మెడి సూదులె యదె వీఁడు
ఎమ్మెలు నెరపుచు నెక్కడఁ దిరిగో
నమ్మికబొంకుల నను సొలసీని

చ. 2:

నాఁతిరో చూడవే నవ్వుచు మీలకు-
నీఁతలు గరపీనిదె వీఁడు
కాఁతాళంబునఁ గనలెడి నాపై
చేఁతలు సేసిఁ జెలఁగుచుఁ దాను

చ. 3:

అల్లనె చూడవె అడవిమృగములకుఁ
బల్లము వేసీఁ బైవీఁడు
వొల్లని ననునిదె వుల్లమి చేకొనెఁ
గల్లరి తిరువేంకటపతి వీఁడు