పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0022-2 కాంబోది సం: 05-121

పల్లవి:

చెంపల యేరు ముండ్ల చెంచువారము నీకు-
నింపుగాని మా పొందులేలయ్యా

చ. 1:

కమ్మనిమామయి పూఁత గదరుఁబిల్లుల గబ్బు
యెమ్మెల మాపట్టుచీర యేపెనార
సొమ్ములుఁ బెంచపుకన్నుఁ జూపులయమ్ములనె
వొమ్మదు నీ పొందు నాకు నొల్లమయ్యా

చ. 2:

కొప్పుగేదఁగులు మాకు కొన నమలీకలు
గొపముత్యాలివి మాకు గురిగింజలు
కప్పురంబు మాకేటి గడ్డల తెల్లని మన్ను
వొప్పదు మాకేల యిచ్చేవొల్లము నేమయ్యా

చ. 3:

కుంకుమ మా కిపుడు జేగురుఁదొడి నుదుటికి
బింకపుఁ దిట్లె మా ప్రియములు
కంకిగాఁగ నెలయించి కౌఁగిటఁ గూడితి నన్ను
వేంకటవిభుండ యిఁక వీడవయ్యా