పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0021-6 ముఖారి సం: 05-119

పల్లవి:

ఏలే దగ్గర నియ్యవిట్టె నన్ను
తూలపుచ్చి మరుబారిఁదోయ దొరకొంటివి

చ. 1:

కాలు దాఁకీ మొక్కేమయ్యా గబ్బిననేవు గనక
యేల దగ్గర విచ్చేసేవిట్టె నన్ను
వాలుఁగన్నుల రెప్పలు వంచి వంచి మొక్కేవు
చాలదటే నన్ను నిట్టి చంపనెత్తుకొంటివి

చ. 2:

తమ్మరసము వడీని తలవయ్య నీ మీఁద
యెమ్మెలకడ్డము వచ్చేవు యేఁటికే నీవు
వమ్ముదొలి మాటలనె వాఁడివసులనె నన్ను
కుమ్ముచుఁ బ్రాణమునిట్టె కొనదొరకొంటివి

చ. 3:

గుబ్బలచెమట దాఁకీఁ గోపగించేవు గనక
ఆబ్బురంపుఁ దిరువేంకటాధీశుఁడా
జొబ్బిలు నా చెమటల సోనల నించక యట్టే
జొబ్బలుగా నామేనెల్లాఁ బొక్కించ దొరకొంటివి