పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0021-4 కన్నడగౌళ సం: 05-117

పల్లవి:

రమణి సురటిగాఁ జెరఁగు వీచీని
చెమరించెనంటాఁ జెలి దూరీని

చ. 1:

కలగంటినంటా కాటుకకనుల నీరు
వొలకఁగా మలగు పై నుసురనీని
తల నొచ్చీనంటా దంతపుటోవరిలోన
పలుకదు పిలిచినాఁ బవ్వళించీని

చ. 2:

తొలఁగితినంటా తూఁగుమంచముమీఁ ద
సెలవినవ్వులతోడ శిరసూఁచీని
అలసితినంటా నలరుఁబానుపుఁ మీద
పులకలమేనితోఁ బొరలెడిని

చ. 3:

సొరిగితినంటా సురతపరవశాన-
నరవిరి కనురెప్పలల్లాడించీని
తిరమాయనంటాఁ దిరువేంకటేశ్వరుఁ
దరుణి గలసి యింకాఁ దమకించీని