పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0020-1 శంకరాభరణం సం: 05-108

పల్లవి:

పోదిగా నేఁడతనికే పొలిఁతి మానము గావ
సేదదేరఁ జెమటలు చిలికించెఁ జూడరే

చ. 1:

కుంతలపు నెరుల చిక్కుల చీఁకటులఁ జిక్కె
యింతలోనే ముఖచంద్రుఁడింతికి నేఁడు
చెంత వాయఁ బతివచ్చి జిగిచన్నుఁగొండలపై
వింత చందురుల దండు విడియించెఁ జూడరే

చ. 2:

ఈతల నిట్టూరుపుల యెండమావులనె వాడె
లేఁతమోవి చిగురు యీ లేమకు నేఁడు
పూఁతగాఁ దెచ్చి చెలియ పులకలవెల్లి నించె
మేఁతలాడి రమణుఁడీ మెలుఁతమైఁ జూడరే

చ. 3:

పుట్టుబోగి సిగ్గుల చూపుల పూవుఁదీగెలపై
పిట్టపిడుగాయ సతిప్రేమము నేఁడు
గట్టిగ వేంకటపతి కౌఁగిటనలమి కొమ్మ
దిట్టఁజేసి భయమెల్ల దిగఁదోసెఁ జూడరే