పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0018-5 పాడి సం: 05-106

పల్లవి:

అప్పటిని చెక్కు నొక్కే వందుకా యిది
యెప్పుడో కూడితిరి మీరిందుకా యిది

చ. 1:

కుందనపు బొమ్మవలెఁ గోపగించుకొని రాఁగా-
నందలానఁ బెట్టుకొంటివందుకా యిది
జందెపు ముత్తెపుఁ బేరు సందులదండల నిట్టే
యిందమంటానింతికిచ్చితిందుకా యిది

చ. 2:

దీకొని కోమలి నిన్నుఁ దిట్టుచు దగ్గరి రాఁగా
ఆకు మడిచియ్యఁ జూచేవందుకా యిది
మీకు మీకే మందటాడి మీరు మీరేమీలోన
యేకమై కూడితిరి మీరిందుకా యిది

చ. 3:

ముద్దులమోముల మీ మీ మోవులపై చేఁతలెల్ల
నద్దములోపలఁ జూచేరందుకా యిది
తిద్దుకొంటిరి రతులు తిరువేంకటేశ మీ-
యిద్దరికి నింపులాయ నిందుకా యిది