పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0018-3 పాడి సం: 05-104

పల్లవి:

ఏతులే నెరప వచ్చీనెవ్వఁడే వీఁడు తన-
రాతిగుండెతోడ నన్ను రమ్మనీనే చెలియా

చ. 1:

కదిమిన చూపులకుఁ గన్నుల నవ్వుచు నా-
యెదురయి నిలుచున్నాఁడెవ్వఁడే వీఁడు
ఉదుటు మీరి తిరిగీ నొదిగి వీనిమదము
సదసేసి వడి నణఁచఁగదె వోచెలియా

చ. 2:

చేరువనె నిలుచుండి చెలితో నవ్వఁగను
యీరసములే యాడీ నెవ్వఁడే వీఁడు
వారించకిటువంటివానిఁ బట్టి కొనగోరఁ
జీరలుగా నొడలెల్లఁ జించఁగదె చెలియా

చ. 3:

చెంతనుండి నన్ను వేసీ సేమంతిపూవులనే
యెంత చెప్పినా మానఁడెవ్వఁడే వీఁడు
ఇంతటి యీ తిరువేంకటేశుఁడిదె నన్నుఁ గూడి
పంతము నెరపి పోయీఁ బట్టుకొనవే చెలియా