పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0018-2 శ్రీరాగం సం: 05-103

పల్లవి:

గొల్లెతలకేలరా గోవజవ్వాది నీకు
చెల్లుఁగాక యెటువలెఁ జేసినా నన్ను

చ. 1:

కట్టినది అంచులతొగరుఁ జీర సందిఁ
బెట్టినది మొలవంక పెద్దగాజు
మెట్టిన కంచుమట్టెల మించుమోఁత చేత-
బట్టినది చల్లచాడె పట్టకురా నన్నును

చ. 2:

మాసినది తురుము చెమరుకంపు నే
వేసినది వెండికుప్పె వెంట్రుకదండ
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల చేయి
తీసేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును

చ. 3:

ముంచినవి చెమటలు మోమునిండ కడు-
నంచినది చూడరా నావాలుఁజూపు
యెంచనేల నన్నునిట్టె యేలితివి వోరి
చెంచెతల లంజకాఁడ శ్రీవేంకటేశుఁడా