పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-3 నాదరామక్రియ సంపుటం: 08-075

పల్లవి:

మీరే యెరఁగరా యిన్ని మేటిజాణలు
మారుమోములిఁకనేల మాటాడరాదా

చ. 1:

సతమైన కూరిమికి సాదించనేల
హితవైన వినయాలే యింపులుగాక
కుతిలంబులేని మతి కొరనేల
రతికెక్కె చనవు మెరయుటగాక

చ. 2:

ఆసపడ్డ చూపులకు నడ్డాఁకలేల
వేసటలేక నవ్వుటే వేడుకగాక
సేసవాలవావులకు సిబ్బితియేల
మోసపోని కూటములే ముచ్చటలుగాక

చ. 3:

ఆయాలు సోఁకిన పనికచ్చికమేలా
చాయలు సన్నలునే చవులుగాక
యీయెడ శ్రీవేంకటేశ యింతీనీవూఁ గూడితిరి
రేయిఁబగలివే పెరరేఁపులు గాక