పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-3 గౌళ సంపుటం: 08-027

పల్లవి:

రాఁగా రాఁగా వలపులు రచ్చబడీని
చేఁగదేరి వున్నాడవు చెల్లు నీకునిపుడు

చ. 1:

వేసారవు నీవైతే విన్నపాలు వినుటకు
సేసేనంటే యెంతలేదు చెలియకును
యీసుద్దులకే వున్నారమిద్దరికి నడుమను
చేసినట్లు చేయవ చెల్లు నీకునన్నియు

చ. 2:

తనియవు నవ్వి నవ్వి దగ్గరిన వేడుకల
చెనకఁగ నెంతలేదు చెలియకును
ననుపుల వంకలొత్త నడుమ నేమున్నారము
చినికేవు తరితీపు చెల్లు నీకు నింకను

చ. 3:

విడువవు నీవిట్టె వెలఁది చెఱఁగు వట్టి
చిడిముడి పడదు యీచెలి యిందుకు
యెడయక శ్రీవేంకటేశ యిట్టె కూడితిరి
చెడదు మావూడిగము చెల్లు నీకునిపుడు