పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-2 వరాళి సంపుటం: 08-026

పల్లవి:

రండూ నేరుతువే రమణి నీవు
వెండిపైఁడి వుంగరాలు వేలనే పెట్టితివే

చ. 1:

అంగములు గరఁగఁగా నాతనితో మాటలాడి
యెంగిలినవ్వులు చిందేవేమే నీవు
వెంగెముల లోపలనే విరహపుటెండ గాసె
చెంగట వెన్నెల గొంత సెలవిఁ జూచితివే

చ. 2:

కనుఁగవ చూపులను కాంతునిఁ దప్పక చూచి
కొనగోరితాఁకులను గొసరేవే
తనివోక తొలుతను తామెరవిరుల వేసి
వెనకఁ జందురులను వెంటనంపితివే

చ. 3:

గక్కన శ్రీవేంకటేశుఁ గాఁగిటను లాలించి
వొక్కమాటే చన్నులను వొత్తేవిపుడు
తెక్కులను నడురేయి తీగెల గూండ్లువెట్టి
జక్కవ పులుగులను సారెఁ గూడించేది