పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0244-4 ధన్నాశి సంపుటం: 08-262

పల్లవి:

ఎప్పుడు నీవారమే నేమిదె వద్దనున్నారము
అప్పగించే నందరిని అన్నిటా మన్నించుమీ

చ. 1:

వరుసకు వంతుకును వచ్చినవారె యిందరు
సరుఁస బెట్టుకో నీవు చల్లఁగా నేఁడు
తరవాతి పనులకు తగు గొల్లెతలు వారె
మరుగకు మింకా నీ మనసునను

చ. 2:

ఆసల బాసలవారు అదె పెండ్లికూఁతురులు
సేసుకో యింకా నీవు చేయి మీఁదుగా
రాసికి మీఁదమిక్కిలి రాకాసి సతులున్నారు
మోసమోక యేలుకో నీ మోహమునను

చ. 3:

వాడికె వేడుకవారె వలచివున్నా రిందరు
కూడవయ్య కాఁగిటను గురుతులుగా
యీడనె శ్రీవెంకటేశ యెనసితి నిదె నేను
యీడువెట్టి మెరయించు మిన్నిటా నీవు