పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0244-3 సామంతం సంపుటం: 08-261

పల్లవి:

అడుగరే విభుఁ నివె యైతెఁ గనక
విడువక మాయింటికి విచ్చేయు మనవే

చ. 1:

పెలుచుమాటలలోని ప్రియములు
యెలమి నెవ్వరికైనా యితవవునా
కలదింతె మావొళ్ళి కపురులు
పలుమారు తనకేవి బాఁతియయ్యీనా

చ. 2:

బిగువురాజసముల పిలుపులు
జగముల దొరలకు చవిపుట్టీనా
తగు ధన మిదియె దాఁపురమూ
అగపడె యిదినేఁడు అనువయ్యీనా

చ. 3:

బింకపురతులలోని పెనఁగులు
మంకుచందాలవారికి మర్మమంటీనా
పొంకాన నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు
లంకెలాయ తనకిది లావయ్యీనా