పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0238-1 బౌళి సంపుటం: 08-223

పల్లవి:

నీతోనేల దూతికకు నిష్టూరము
ఆతరుణి వచ్చి మరి అన్నిఁజూచుకొనీని

చ. 1:

యిప్పుడేలకోపించేవు యింతితో నొకమాఁటు
చెప్పుమన్న మాఁటలాపె చెప్పెఁగాక
తప్పులేదు నీయందనీ దానికైనా సంతోసించు
ముప్పిరిగాఁ గలవెల్లా ముందరనయ్యాని

చ. 2:

గద్దించనేల నీకు కామినిని వేళచూడ
వద్దికిఁ బొమ్మనగాఁను వచ్చెఁగాక
సుద్దుల నీకులోనయ్యీ చుట్టము జేసుకోయిఁక
తిద్దుకొనేవారు గల్తే తేరిఁ దగవులు

చ. 3:

వాదులాటలేల నీకు వనిత నీగుణమిట్టె
సోదించి రమ్మనఁగాను సోదించెఁగాక
యీదెసఁ గూడితివి నీవింతలో శ్రీవెంకటేశ
పోదిగా నాపెఁగూడె పొసఁగె నీపొందులు