పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0237-6 దేసాళం సంపుటం: 08-222

పల్లవి:

చిఱుత నవ్వులేల సిగ్గులు వడఁగనేల
గుఱిఁ దలరాయి సేసుకొంద మిఁకలేవయ్యా

చ. 1:

చెప్పఁబోతేఁ బసలేవు చేసిన నీచేఁతలివి
యిప్పటి చీఁకటితప్పులివియేకాని
వుప్పటించి యాడకుండా వూరివారికెల్లాను
చప్పుడుజాగంటవేసి చాటుదములేవయ్యా

చ. 2:

నవ్వఁబోతేఁ బసలేదు నడవడి లోననెల్లా
పువ్వుల కురపిదానిఁ బొందుటేకాని
రవ్వ నిన్నుఁ జేయకుండా రచ్చలోని వారికెల్లా
అవ్వల లేకలువ్రాసి అంపుదము లేవయ్యా

చ. 3:

పట్టఁబోతేఁ బసలేదు పైపై నీనేరమి
వొట్టి చీరలుదీసిన దొక్క టేకాని
నెట్టన శ్రీ వెంకటేశ నీవు నన్నేలితివి నీ
చుట్టాలకు గురిసేసి చూపుదములేవయ్యా