పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0231-5 దేసాళం సంపుటం: 08-186

పల్లవి:

అవునే యింతేసి సేసేవపుడే నీవు
చవులుసేసి యిచ్చేది జవ్వనమేకాదా

చ. 1:

సిగ్గువడ్డవారికిని చెక్కిటి చేయేమరఁగు
దగ్గరి రాఁగదవే ఆతఁడు విల్చీని
కగ్గులేక నీవంటి కన్నెలేకారా పతిని
యెగ్గులుఁ దప్పులుసోఁక నెలయించేవారు

చ. 2:

సెలవి నవ్వేవారికి చేతిమొక్కులే మరఁగు
తలఁగకుండఁగదే ఆతఁడు ముట్టీని
మొలచిన నీవంటి ముగ్ధలేకారా పతిని
తెలిపి రతికిఁదీసి తెమలీఁచేవారు

చ. 3:

కాఁగిటఁగూడేవారికి కనురెప్పలే మరఁగు
వీఁగకువే కూడెను శ్రీవెంకటేశుఁడు
మాఁగినమోవి నీవంటి మానాపతులేకారా
రాఁగలై యీతనిఁ బొంది రవ్వకెక్కినారు