పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0229-2 దేశా(సా)క్షి సంపుటం: 08-170

పల్లవి:

మర్మము నీవె యెఱిఁగి మన్నింతువుగాక నన్ను
ధర్మమా నీకునాకుఁ దారుకాణలయ్యా

చ. 1:

పల్లదపు నామాటకు భావించేఅర్ధము నీవు
చల్లని నామనసుకు సాక్షివి నీవు
తెల్లముగా నామోములో తేటలకళలు నీవు
చెల్లఁబో యింకా విచ్చెచెప్పనేఁటికయ్యా

చ. 2:

చెప్పరాని నాచేఁతకు సెలవినవ్వులు నీవు
వొప్పు నావయసునించే వొడివి నీవు
ముప్పిరి నాచక్కఁదనమున కద్దమవు నీవు
చిప్పిల నింకా విచ్చిచెప్పనేఁటికయ్యా

చ. 3:

గట్టి నాచన్నులమీఁది ఘనహరమవు నీవు
పట్టిన నావ్రతానకు ఫలము నీవు
యిట్టె శ్రీవెంకటేశ యెనసితివింత నన్ను
చిట్టకాననిఁక వచ్చిచెప్పనేఁటికయ్యా