పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0227-1 నాదరామక్రియ సంపుటం: 08-157

పల్లవి:

ఎప్పుడును నీమనసు యెరఁగని కల్లలేదు
ముప్పిరిగొనేటి యీమోసమేలయ్యా

చ. 1:

వలపులు సరివచ్చె వనిత యిందుకు మెచ్చె
వెలినేల లోనికిఁక విచ్చేయరాదా
యెలమి సరిబేసికి యిదె సుద్ది నిన్నననేల
నిలువు నివ్వెరగులు నీకేలయ్యా

చ. 2:

మాటలు తారుకాణాయ మగువకుఁ బ్రియమాయ
మాటికి నవ్వఁగనేల మన్నించరాదా
తేటలుగా నీనిజాలే తెలిసీఁ జెలులకెల్ల
యీటుతోడి కుచ్చితాలు యిఁకనేలయ్యా

చ. 3:

రతిఁ దమకము నిండె రమణిభాగ్యము పండె
కతలేల పంతములు గైకొనరాదా
యితవై శ్రీవెంకటేశ యింతినిట్టె కూడితివి
మతకరి తరితీపు మరియేలయ్యా