పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0226-2 భైరవి సంపుటం: 08-152

పల్లవి:

చిత్తము రా సేవలెల్లఁ జేతువుగాక
కొత్తలా మీయిద్దరికిఁ గొంకనేలే యిఁకను

చ. 1:

సెలవి నవ్వునిండితే సిగ్గులేల పెంచేవే
నిలువున నవిరెండు నీవొళ్ళివే
వలుపే పూవఁగాను వాసనలు మానునా
కొలువులో పతితోడఁ గొంకనేలే యిఁకను

చ. 2:

తనువు చెమరించితే తలయాల దాఁచేవే
నినుపుననవి రెండు నీవొళ్ళివే
మనసు గరఁగఁగాను మచ్చికలు మానునా
కొనితెచ్చేవా బుద్ది కొంకనేలే యింకను

చ. 3:

మఱపు పైకొంటేను మాటలేల కొదికేవే
నెఱతనాలవి రెండ నీవొళ్ళివే
చిఱుతల మేలుమంగ శ్రీవెంకటేశుఁడు గూడె
గుఱియైన పనులకు కొంకనేలే యిఁకను