పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0226-1 మాళవి గౌళ సంపుటం: 08-151

పల్లవి:

మాతోనింకానా మజ్జాతాయను వకు (?)
చేతికి లోనై నమీఁదఁ జెప్పవలెనా

చ. 1:

జంగిలి సతుల నీవు సారెసారె నమ్మించఁగా
అంగడిఁ బడీనవె నీ అన్నమాటలు
యెంగిలిగా నీమోవి యెవ్వరైనాఁ జేయఁగాను
ముంగిట మెరసెను నీముసిముసి నవ్వులు

చ. 2:

చేరి పదారువేలకు సేసలు నీవు వెట్టఁగా
ఆరీతిఁ బడెనవే నీ అన్ని చేఁతలు
కోరికలు మించినట్టి కొలనిసతులచేత
నీరువంక తుంగైనవి నీగుణాలు

చ. 3:

యింపుల రాచకూఁతురునెత్తుక నీవు రాఁగానే
సంపద మించినవి నీచతురతలు
ముంపున శ్రీవెంకటేశ ముందె నన్నుఁ గూడితివి
చెంపల నిలిచెను నీసిగ్గులెల్లాను