పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0225-5 ధన్నాశి సంపుటం: 08-149

పల్లవి:

సాము సేతువుగా నీవు సరుస రాముఁడవై
యీమగువనేరువులు యివి చూడరాదా

చ. 1:

బొమ్మల విండ్లచేత పూఁచి చూపుల యమ్ముల
కుమ్మరించి చెలి నీపై గురులేసీని
సమ్మతించి యిరువంక చన్నుల కాంతులు సారెఁ
జిమ్ము పయ్యదలోఁ బుట్ట చెండ్లాడీని

చ. 2:

గక్కన బిసకాండపు కరముల సన్నలను
అక్కజపు నీతోఁ గోలాటమాడీని
చెక్కుచెమట గోరులఁ జిందకుండా మీఁటుచు
చక్కు బుఱ్ఱటకొమ్ములు సాధించీని

చ. 3:

చిగురుమోవిమాటల చేకత్తుల పంతాలఁ
దగిలి నీపైనాపె దండ వెట్టీని
నగుతా శ్రీవెంకటేశ నంటున నీవు గూడితి
అగపడి నీగరిడినన్నిటా మించీని