పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0225-1 నాట సంపుటం: 08-145

పల్లవి:

నీతోను సరి బొంక నేనోపను
కాతరించినట్టి నీకనుసన్నదానను

చ. 1:

చెక్కునొక్కి వేఁడుకొంటే సేదలెల్లాఁ దేరిచితి
మొక్కితిఁజుమ్మీనీకు మొన్న మొన్ననే
తక్కరివిద్యలుయెమీఁ దలఁచకుమీ అయ్య
చిక్కఁగా వలచిన నీచేతిలోనిదానను

చ. 2:

పాదములు పట్టుకొంటి పంతములు నీకిచ్చితి
అదిగొన నే నవ్వితి నప్పుడప్పుడే
కాదుగూడదనకుమీ కాఁకలు సేయకుమయ్య
యేదెసచూచినా నీకునింటిలోనిదానను

చ. 3:

యిచ్చకములు సేసితినియ్యకొంటి నన్నిటికి
కొచ్చి శ్రీవెంకటేశ నేఁగూడితి నేఁడే
పచ్చి సేఁతలెల్లాఁ జేసి పదరకుమీ అయ్య
కచ్చుపెట్టుక వుండే నీ కాఁగిటిలోదానను