పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0224-2 శంకరాభరణం సంపుటం: 08-140

పల్లవి:

ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పదే
బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు

చ. 1:

చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి
చిక్కించెనాపె తొలుత చేరియాతని
మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను
పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు

చ. 2:

పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి
దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని
పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా
బాటగానాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు

చ. 3:

కాఁగిలించుక యిందిర కన్నులవలపు చల్లి
ఆఁగెను శ్రీవేంకటేశు నౌభఁళానను
చేఁగదేరఁ జొక్కియాపెఁ జూచి ఆతఁడె తానై
పాఁగినరతుల నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు