పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0223-1 భైరవి సంపుటం: 08-133

పల్లవి:

వలపుపచారాల వనితలము
వులుగులిగెత్తఁగాను (?) వోపదువా నీవు

చ. 1:

నగవులే తెలుపులు నవ్వులలో సుద్దులయితే
పగటు మీరఁగనట్టే పంచవన్నెలు
చిగురుటధరమున చిందఁజొచ్చె నింతలోనే
వొగరువేసునో యేమో వోపుదువా నీవు

చ. 2:

మాటలే తేనెలు మాటలలో తేటలయితే
గాటమైన మిరియాలకంటెఁ గారాలు
వాటమై నాలికమీఁద వడిగొని వచ్చీనవి
వూటలైన యీ యెంగిలికోపుదువా నీవు

చ. 3:

కలయికలే చల్లన కలయికలలోపల
వెలలేని రతులెల్లా వేఁడివేఁడ్లు
యెలమి శ్రీవేంకటేశ యెనసితివి మాచేతి
వులివచ్చీ చేఁతలకు నోపుదువా నీవు