పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0222-6 ముఖారి సంపుటం: 08-132

పల్లవి:

అడుగరే చెలులాల అంతేసి నేనెరఁగ
బడివాయఁడాసలకో పంతాలకునో

చ. 1:

నగవొక్కటేకాని ననిచి రెంటికి వచ్చు
జగడానకో లోలో సరసానకో
తగినట్టి బలుదొర తానేల మొక్కీనే
యెగసక్యాలకో మరి యింపులకునో

చ. 2:

పిలుపొకటేకాని పెనఁగ రెంటికి వచ్చు
వలపులకో వట్టి వారకానకో
వెలలేని నేరుపరి వేఁడుకొననింత యాలే
తలఁపు దెలుసుకోనో దంటతనమో

చ. 3:

కూడినదొక్కటే కాని గురుతు రెంటికి వచ్చు
వేడుకలకో రతివేసాలకో
యీడనే శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నునేలె
వాడికలకో నిండువహి కెక్కనో