పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0222-5 సాళంగనాట సంపుటం: 08-131

పల్లవి:

పొంచి యేమి సేసినాను పుచ్చకాయలోర్చుఁ గాక
యెంచి వేలఁజూపితేను యితరములోర్చునా

చ. 1:

కన్నుల నొకతె నిన్ను కాఁతాళించి తిట్టితేను
వెన్నెలరేకు నవ్వులు వెదచల్లేవు
నిన్నువంటిచేఁతలు నేఁడు వకు నున్నవా
వెన్నదీసినట్టి చల్ల వేఁడనెట్టివారము (?)

చ. 2:

పొలసి సిగ్గుననాపె బొమ్మల నదలించితే
చెలరేఁగి చెలరేఁగి చెక్కునొక్కేవు
తలఁపులో నీవలె తాలిమి మాకున్నదా
వొలిసి యీలకూరకు నుప్పడిగేవారము

చ. 3:

కడు వాఁడికుచములఁ గాఁగిలించి వొత్తితేను
జడియక ఆపెకిట్టే సంతసించేవు
కడఁగి శ్రీవేంకటేశ కలసితివిఁకనేము
వడియని మోవితేనె వారవట్టువారము