పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0222-3 పాడి సంపుటం: 08-129

పల్లవి:

రారే యింకానతని రవ్వసేతురా
ధీరుఁడైనవానినంత తెమలించవచ్చునా

చ. 1:

నయగారి వానికిఁ గా నంటుతోడి సరసాలు
ప్రియునికిఁ గా మంచిప్రేమమెల్లాను
క్రియ గలవానికిఁ గా క్రిందిమీఁది విచారాలు
భుఁయము లేనివానికి పట్టినదే పంతము

చ. 2:

ఆసగలవానికిఁ గా అందరితో వినయాలు
బాసగల వానికిఁ గా పాలకూళ్ళు
వేసరని వానికిఁ గా విచ్చనవిడి నవ్వులు
దోసమొల్లవానికి తోఁచినదే హితవు

చ. 3:

పనిగల వానికిఁ గా పైపై తమకములు
యెనసిన వానికిఁ గాను యేకాంతాలు
ఘన శ్రీవేంకటేశుఁడు గలసె నన్నింతలోనే
యెనలేక యీతనికి యెక్కినదే వయసు