పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0057-6 ముఖారి సంపుటం: 06-096

పల్లవి:

అడవిచాటున నుండి యాఁటదానను న
న్నుడి కించే వేరా నీ వుడుకునను

చ. 1:

పించెపుఁ బయ్యెదలోని పెనుగుబ్బలు మూయుచు
చెంచెత యేల యేఁచేవె చెల్లఁబో నన్ను
మంచుఁబులకలచాటు మగనాలిగుబ్బలు సో
ధించి చూచే వేరా తెట్టఁదెరువునను

చ. 2:

తొలుకరి మెఱుఁగుల తొడలయాకుఁజీరచె
నలయించే వేఁటికి నీ వయ్యో నన్ను
నులివెచ్చమాటల నొవ్వ నామనము సోఁకఁ
బలికే వదేర బట్టబాయిటను

చ. 3:

చిక్కనితేనెలతావి చిగురుమోవి నవ్వుచు
చక్కఁజూడ కేల పగచాటేవె నన్ను
చక్కని వేంకటగిరిస్వామి నాకౌఁగిలి నీకు
పుక్కట దొరకె పొట్టఁబొరుగుననూ