పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0057-3 శంకరాభరణం సంపుటం: 06-093

పల్లవి:

కుటిలా లేఁటికి కోమలియెడ నేఁ
డిటువలెఁ జేయఁగ నిం పౌనా

చ. 1:

పుప్పొడిచల్లినఁ బొక్కెటిదేహము
కప్పుర మేఁటికిఁ గలుపేరె
ఒప్పుగ వేనీ ళ్లొల్లనిదేహము
నిప్పులు చల్లఁగ నిలచీనా

చ. 2:

వెన్నెలబాయట వేగెటిమేనికి
పన్నీ రేఁటికిఁ బామేరె
సున్నపురాతికి జొబ్బిల నుదకము
నున్నతిఁ జల్లఁగ నోర్చీనా

చ. 3:

తిరువేంకటపతి తెప్పలఁ దేలఁగ
తరుణికి నేఁటికిఁ దాపములూ
దొరకొని దైవముతో మాటలాడఁగ
పరికెలు వెట్టఁగఁ బాడౌనా