పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0057-1 నాట సంపుటం: 06-091

పల్లవి:

ఇంకా నేఁటికి నింతులు
వేకంటరాయఁడ విడు విడు చెఱఁగూ

చ. 1:

పిరిగొన్న ముత్యపుఁ బేరులనడుమను
తెరవను దాఁచుక తిరుగుచును
కెరలుచు నాకౌఁగిటికి దగ్గఱేవు
వెఱపు లేక నీవు విడువిడు చెఱఁగు

చ. 2:

ప్రేమ మలర నతి బింకపునీనగు
మోమున నలముక మురియుచును
తామసమతితో తమ్ముల మిడుకొని
వేమరుఁ గోరక విడు విడు చెఱఁగు

చ. 3:

చుట్టుఁద పారపు చుంగుల నడుమను
పెట్టితి వింపున ప్రియసతిని
రట్టడి వేంకట రమణుఁడ కలసితి
వెట్టిగాద యింక నిడు విడు చెఱఁగూ