పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0056-6 భైరవి సంపుటం: 06-090

పల్లవి:

పట్ట కింత మాచెఱఁగు బాఁపఁడా నాఁడె
వుట్టిఁ గట్టితివి కుల మోబాఁపఁడా

చ. 1:

పలుకుల వాదాలబాఁపఁడా యిట్టె
పలునీళ్ల మునిఁగె బాపఁడా
పలువంచలఁ బొరలే బాఁపఁడా యిట్టె
వొలికిజంటెలఁ గోప మోబాఁపఁడా

చ. 2:

పాయనియాసొదపు బాఁపఁడా ఇట్టె
బాయిటఁ బడె నీ విద్య బాఁపఁడా
పాయపు తల జడల బాఁపఁడా యిట్టె
వోయయ్య బతిమాలకు మోబాఁపఁడా

చ. 3:

పారవేసేవు సిగ్గెల్ల బాఁపఁడా యిట్టె
పాఱుతెంచేటి కమ్మటి బాఁపఁడా
భారపు వేంకటగిరి బాఁపఁడా మమ్ము
నోరసేయక కూడితి వోబాఁపఁడా