పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0056-5 సామంతం సంపుటం: 06-089

పల్లవి:

ఎట్టు దొరికనె చెలియ యిద్దరికి నిటువంటిఁ
పట్టనిలుపఁగరాని బరువైన వలపు

చ. 1:

నిడివి తమకములచే నిట్టూర్పు లివె నీకు
అడియాస తమకంబు లాతనికిని
కడలేని వేదనల కన్నీళ్లివే నీకు
అడరుఁబరితాపంబు లాతనికిని

చ. 2:

గుఱుతైన యతనిపై గోరాటలదె నీకు
అరుదైన ప్రియమాన మాతనికిని
పురిగొన్న విరహమునఁ బొరలాట లవె నీకు
అరమరపుఁ బరవశము లాతనికిని

చ. 3:

ఎనసి యాతనిరాక కెదురుచూచుట నీకు
అనుకూలుఁడై కలయు టాతనికిని
అనయంబు తిరువేంకటాధీశుఁ డిడె నీకు
అనుభవన కెల్ల నీ వాతనికిని