పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0056-3 ఆహిరి సంపుటం: 06-087

పల్లవి:

ఇన్నియును దగఁగలిగె నీయింతి కిదె యిపుడు
కన్నియల కిందరికిఁ గలిగె మోహములూ

చ. 1:

నిగనిగని మెఱుఁగు వెన్నెల మోమునకుఁ గలిగె
చిగురుమోవికిఁ గలిగెఁ జిఱునగవులు
పగటుఁగనుఁగొనలఁ బలపలని కెంపులు గలిగె
పొగరుఁజెమటలు గలిగె పొలఁతిచెక్కులను

చ. 2:

ఒయ్యార మగు నలపు లువిదమేనికిఁ గలిగె
గయ్యాళి నడపులకుఁ గలిగె మురిపెములు
తొయ్యలికిఁ గలిగె సంతోషంపుఁ బరవశము
పయ్యెదకుఁ గలిగెఁ బయిపైని నునుఁబూఁత

చ. 3:

వెలఁది కిప్పుడు గలిగె వేంకటేశ్వరు కరుణ
తలఁపులకుఁ గలిగె చింతా వియోగంబు
పులకలకుఁ గలిగెఁ దలఁపులలోని జొంపములు
అలుకలకుఁ గలిగెఁ బాయని విలాసములు