పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0056-2 కన్నడగౌళ సంపుటం: 06-086

పల్లవి:

ఒప్పమి మేలై యొనఁగూడె నాకు
నె(త?)ప్పులే ఒప్పవుట చెప్పనేలమ్మా

చ. 1:

నవ్వులచూపులు నాఁటినచోటు
నొవ్వులు సేయక నొచ్చీనే
దవ్వులమాటలు తాఁకినతావూ
రవ్వలచేఁతల రాఁగీనే

చ. 2:

తియ్యపుఁ జేఁతలఁ ద్రెవ్వినచోటు
వయ్యమై హృదయము నాడీనె
కయ్యపుఁ గాఁకలఁ గ్రాఁగినతావూ
ఒయ్యన ఫై పై నుడికీనే

చ. 3:

కొండలరాయనిఁ గూడిన మనసూ
కొండయి లోలోనె కూడీనే
నిండిన తమకము నించిన యతఁడూ
మెండైన నాప్రేమ మెచ్చీనే