పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0055-4 సామంతం సంపుటం: 06-082

పల్లవి:

కొమ్మ నీ వెవో కోపంతు వతఁడు
రమ్మనఁగఁ బిలువ నిటు రావమ్మా

చ. 1:

నెయ్య మెఱింగి చెలియ నీవె పో యతనితో
చయ్యాటములనే పగ చాటేవు
కయ్యపుమాటలకు కనుచూపు కాఁకలకు
నియ్యకొన కతనిచన వియ్యవమ్మా

చ. 2:

అందముగ నతఁడు మాటాడఁగా నతనితో
మందమందమె కాని మాటాడవు
గొంది నిందాఁక చెక్కునఁ జేయి తియ్యవిదె
మందలించక వెనక మఱవవమ్మా

చ. 3:

ఇప్పుడిదె తిరువేంకటేశ్వరుఁడు పచ్చడము
కప్పఁగానే కొంత కసరేవు
రెప్పలను నవ్వు పచరించి తింతటిలోన
నెప్పుడును నిటువలెనె యెనయవమ్మా