పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0055-3 పాడి సంపుటం: 06-081

పల్లవి:

ఘుమ్మనియెడిశ్రుతి గూడఁగను
కమ్మని నేతులు కాఁగఁగఁ జెలఁగె

చ. 1:

నీలవర్జుఁ డని నీరజాక్షుఁడని
బాలుని నతివలు పాడేరో
పాలు విదుకుచును బానల కాఁగుల
సోలి పెరుగు త్రచ్చుచుఁ జెలరేఁగి

చ. 2:

మందరధరుఁ డని మాధవుఁడని గో
విందునిఁ బాడేరు వెలఁదు లిదె
నందవ్రజమున నలుగడ నావుల
మందలఁ బేయల మంచిరవముల

చ. 3:

వేంకటపతి యని వేదనిలయుఁడని
పంకజనాభునిఁ బాడేరో
అంకులచేతను నలరురవంబుల
బింకపుమాటల బృందావనమున