పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0043-1 శంకరాభరణం సంపుటం: 06-007

పల్లవి:

అతను సంపదకంటె నసదా చెలిరూపు
మతిచింతచేత వేమరు నలఁగెఁ గాక

చ. 1:

తగుఁ జందురుని నణఁచఁ దగదా చెలిమోము
వగలచే నొకయింత వాడెఁగాక
పగటుఁగోవెల మించి పాఱదా సతి పలుకు
జగడమునఁ బతిఁబాసి సన్నగిలెఁ గాక

చ. 2:

కదలు గందపు గాలి గా(వ?)దా చెలియూర్పు
కదిమేటి మదనాగ్నిఁగ్రాఁగెఁ గాక
కొదమ తుమ్మెదగమికిఁ గొఱఁతా చెలితురుము
చెదరి మరుబాణముల చే జాఱెఁగాక

చ. 3:

లీలఁబన్నీటికిని లేఁతా చెలి చెమట
లోలిఁ బూఁబానుపున నుడికెఁగాక
యేలచిగురునకంటె నెరవా చెలిమోవి
గేలి వేంకట విభుఁడు గీలించెఁగాక