పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0042-6 శంకరాభరణం సంపుటం: 06-006

పల్లవి:

ఒక్కలాగువాఁడవా యోరి యిట్టి
తక్కులం బెట్టితి నన్నుఁ దగిలించి నీవు

చ. 1:

తెలిసితిమిలే తెప్ప తిరుణాళ్లనాఁటి
జలముల నామీఁద జల్లుతానే
సొలపుం జూపుల నిట్టె సొంపుగఁ జూచి చూచి
వలపు జుల్లితివి యెవ్వతె పైనోరి

చ. 2:

కంటిమి నీలాగుగ్రక్కనఁ దిరువీథుల
నింటి ముంగిటను నీ వేఁగుతానే
వెంటనె యాలవట్టము విసరేటి సతి గుబ్బ
చంటిమీఁద నొరగి వేసాలఁ బోతివో

చ. 3:

ఇన్నియు మెచ్చితిరా నిన్నింతలోనె యిప్పుడు నీ
వున్న పైఁడియుయ్యాల నీ వూగుతానే
మన్నవ కౌఁగిట నన్ను మరపించి యెక్కడికొ
కన్నులార్చితివి వేంకటరాయ యోరి