పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0055-1 వరాళి సంపుటం: 06-079

పల్లవి:

నీకువలచిన సతికి నెగులు గలదా మీఁద
నీ కరుణ మఱవ కింతియ చాలును

చ. 1:

నీ వంటి చతురునకు నిక్కంబుగా వలఁచి
జీవంబు విడిచినా సేగిగలదా
భావముల నినుఁదలచి పడఁతి యిట్లాయెనని
ఆవేళ నను దలఁచు మంతేచాలు

చ. 2:

తగిలి నినుఁ బాసి సంతాపదావాగ్ని నిటు
నొగిలి నా నాకిందు నొప్పిగలదా
పగదేర మరుని పూ బాణములఁ దెగినపొం
దుగ నప్పుడైన వగతువుగా నీవు

చ. 3:

కూరుముల నిటు నిన్నుఁ గూడినలతాంగికిని
వేఱె యిఁక మరుచేతి వెఱపు గలదా
సారమతి వేంకటేశ్వర నన్ను నలయించి
యీరీతి నైనఁ జన విత్తుగా నీవు