పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0054-4 పాడి సంపుటం: 06-076

పల్లవి:

నెఱజాణ తనమూ నీ కింత కలదట
చిఱునవ్వు జెలికింత చింతైనవలదా

చ. 1:

నిక్కమైన బిగువు నీకింత గలదట
చక్కనియింతికి వద్దా జడనైనాను
ఎక్కడో నీమనసు ఎంతైనఁ గలదట
చెక్కు మీఁద దరుణికిఁ జేయైన వలదా

చ. 2:

నెలకొన్నకసరు నీ కింత గలదట
వెలఁదిమతికి వద్దా వెరగైనా
నిలువుఁజెలువమూ నీకింత కలదట
కలికి చెలికిఁ గొంత కాఁకైన వలదా

చ. 3:

నీమేనివెరపూ నీ కింతకలదట
భామకు వద్దా తలప ట్టయినా
నేమము వేంకటేశ నీ కింతగలదట
కామినికి నింత వద్దా కౌఁగిట నీచనవూ