పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0054-3 సామంతం సంపుటం: 06-075

పల్లవి:

మంటలంటా బెదరీని మాణిక్యాలు చూచి చెలి
యింటిలోనూ నెరవాయె నేమిసేతమే

చ. 1:

నిండుఁబరితాపమున నీలపుమణులమేడ
నుండరాక దేహమెల్ల నుమ్మగించంగా
పండు వెన్నెలల మంచిబయట నిలిచిచెలి
యెండనవి తల్లడించె నేమిసేతమే

చ. 2:

గ్రక్కనఁ జెలులుచేరి కప్పురపు బాగాలు
చెక్కువట్టి కదలించి చేతి కియ్యంగా
పొక్కుచుఁ జెలులఁ గన్ను బొమ్మలవిండ్లఁగోప
మెక్కువట్టి యేయ జూచి నేమిసేతమే

చ. 3:

పాయక వేంకటపతి పచ్చఁబట్టు ముసుఁగులో
సోయగపు రతులను చొక్కుచునుండి
రాయడి నెవ్వతె పసపాయెనో పచ్చడమని
యేయెడ నైఁనా దూరే నేమిసేతమే