పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0053-5 సామంతం సంపుటం: 06-071

పల్లవి:

విరహపు రాజదె విడిదికి రాఁగా
సిరులఁ జేసె నిదె సింగారములూ

చ. 1:

నెలఁత నుదుటిపై నీలపుఁగురులనె
తొలుతనె కట్టెను తోరణము
మొలకచెమటలనె ముత్యపు మ్రుగ్గులు
అలరిచె మదనుం డదె చెలిమేన

చ. 2:

దట్టముగాఁ జింతాలతనే వడిఁ
బెట్టెఁ జప్పరము పెనఁగొనఁగ
పట్టినమైతావుల పరిమళములు
కట్టించెను చెంగట వలరాజు

చ. 3:

విందగు వేంకట విభుని ప్రేమచేఁ
బొందుగఁ బెట్టెను బోనాలు
ఇందువదన కీయిందిరావిభుని
కందుదేర నలుకలు చవిచేసె