పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0053-4 వరాళి-ఏకతాళి సంపుటం: 06-070

పల్లవి:

ఇప్పుడిటు విభుఁ బాసి యింతలోననె నేఁడు
తప్పు లోపలి తప్పు దైవమా చెలికి

చ. 1:

నగవు లోపలి యలపు నంపైన పొలయలుక
పగటు లోపలి వెరగు పచ్చివేఁడి
మొగము కాంతుల మెఱపు ముంచు నలకల చెదరు
పగలు చీఁకట్లాయె బాపురా చెలికి

చ. 2:

బలిమి లోపలి భయము పలుకుఁదేనెల కనరు
చెలిమి లోపలి చేఁదుచింత చెలికి
బలుపుఁగుచముల లోని బట్టబయ లగు నడుము
కలిమి లోపలి లేమి కటకటా చెలికి

చ.3:

నిడుపు లోపలి కురుచ నీడలోపలియెండ
వడిమంచి తరువు విడువని తమకము
కడువేంకటేశ్వరుని కౌఁగిటను పరవశము
మడుఁగు లోపలి మైల మాన దీ చెలికి