పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0053-3 దేశాక్షి సంపుటం: 06-069

పల్లవి:

మదవికారములు మానేవో, నా
యెదురనె నీవు నేఁ డింకాఁజేసేవో

చ. 1:

నందవ్రజములోన నాఁడు నీవు గొల్ల
మందల మగువల మరగించీనా
మందులుమాయలు మఱచితివో, యిప్పు
డిందూ నామీఁద నింకాఁ జేసేవో

చ. 2:

నలినాప్తకులుఁడవైనాఁడు నీవు ఇంతిం
గలకాలమెల్ల నంగడిబెట్టినా
మలినపు మాటలు మఱచితివో నన్ను
నెలయించి కాఁకల నింకా సేపేవో

చ. 3:

నరసింహుఁడవై నాఁడు నీవు పెక్కు
మురిపెంపు వికారములఁ బోయినా
తిరువేంకటేశ పొందితివి నన్ను నీ
యిర వైన యీ చేఁత లింకాఁ జేసేవో