పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0053-2 సామంతం సంపుటం: 06-068

పల్లవి:

కస్తూరి వాట్లం గరంగేవు మైఁ
గస్తూరి నాతనిం గమ్మంగ రాదా

చ. 1:

నీరు వసంతం నీపైఁజల్లిన
మారు కుమారు రమణి నీవు
సారపు నీరతి జవ్వాది చెమటల
నీరాతనిపై నించంగరాదా

చ. 2:

పువ్వులు నీపై బొలుపుగఁ బోసిన
నెవ్వ దీఱఁగ నీవతని
రవ్వగు నీ వుపరతులఁ గూడి తల
పువ్వులతని దిగఁ బోయఁగ రాదా

చ. 3:

పంకజమునఁ దాఁ బైకొని చేరి
వెంకటపతి నిను వేయఁగను
కొంకక నిరతింగూడి నీవు ముఖ
పంకజ మాతనిఁ బైకొనరాదా