పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0053-1 హిందోళవసంతం సంపుటం: 06-067

పల్లవి:

నన్నేల యేఁచేరే నగుబాట్లు
అన్నింటా నాకె ఘనమై యుండుఁగాక

చ. 1:

నాకేలె యీసింగారాలు నాకేలె యీనటనలు
ఆకడ నాతఁడు సుఖ మందఁగాను
కైకొనె నాతని చెంతఁ గల దెల్ల నా మనసు
ఆకె పట్టపు దేవు లై యుండుఁగాఁక

చ. 2:

నేనేలె యాతనికి నేనేలె బాలకిని
ఊనిన సుఖమునందా నుండఁగాను
కానిక లాకె నవ్వులు కన్నులఁ బట్టఁగను
ఆనేరుపులే చవులై యుండుఁగాక

చ. 3:

వద్దేలే నాతోడి పొందువద్దేలే తనకు
ఒద్దిక లక్కడం గలి గుండంగాను
గద్దిరియై కలసి వేంకట విభుండు
అద్దొ యింకా నన్ను నణకించుంగాక