పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0052-6 శంకరాభరణం సంపుటం: 06-066

పల్లవి:

నీడల చూపులు నీకేలే యీ
వాడక వాడెడి వడ నీకేలె

చ. 1:

నిలువుల నటనలు నీకేలే యీ
నిలుగుల నడపులు నీకేలే
నెలవులకరఁగులు నీకేలే యీ
కులికెటి నును సిగ్గులు నీకేలే

చ. 2:

నెఱుల చెదరులివి నీకేలే యీ
నెఱవగు చదరులు నీకేలే
నెఱతనపుసరులు నీకేలే యిదె
చెఱఁగునమూసెదు చెలి నీకేలే

చ. 3:

నిక్కపుఁబోఁకులు నీకేలే యిదె
నిక్కలగంటివి నీకేలే
నిక్కితి వొరపుల నీకేలే యిదె
దక్కె వేంకటోత్తముఁడు నీకేలే