పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0052-4 భైరవి సంపుటం: 06-064

పల్లవి:

అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగ నాచారమ్మ
తమ్మి యింట నలరుకొమ్మా వోయమ్మా

చ. 1:

నీరిలో నాఁదల్లడించి నీకే తలవంచి
నీరికిందాఁ బులకించి నీ రమణుండు
గోరికొనఁ జెమరించి గోపమే పచరించి
సారెకు నీయల కిట్టె చాలించవమ్మా

చ. 2:

నీకుఁగానె చెయిజాఁచి నిండాఁ గోపమురేఁచి
మేకొని నీవిరహాన మేను వెంచేని
యీకడాకడి సతుల హృదయమే పెరరేఁచీ
నాకు మడిచియ్యనైనా నానతియ్యవమ్మా

చ. 3:

చక్కఁదనములె పెంచి నకలముఁగాల దలంచి
నిక్కపు వేంకటేశుండు నీకె పొంచేని
మక్కువతో నలమేల్‌ మంగనాచారమ్మా నీ
యక్కున నాతని నిట్టె అలరించవమ్మా